హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడు ఎలా తయారు అయ్యిందో చూస్తే ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు అతి తక్కువ సినిమాల్లోనే నటించిన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి ఒక్క బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకొని ఉంటారు, వారిలో ఒక్కరు మీరా జాస్మిన్ , కేరళ లో పుట్టి పెరిగిన ఈ మలయాళీ భామ ని అంత తేలిక గా ఎవ్వరు మర్చిపోలేరు,

 

సూత్రదారా అనే మలయాళీ సినిమాతో వెండితెర పై తొలిసారి గా కనిపించిన ఈమె తొలుత తమిళ్ మరియు మలయాళం బాషలలో అత్యధిక సినిమాలు చేసి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది, ఆ తర్వాత తెలుగు లో అమ్మాయి బాగుంది అనే సినిమాతో పరిచయం అయినా ఈమె తోలి సినిమాతోనే తన నటన మరియు అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

ఆ తర్వాత తెలుగు లో గుడుంబా శంకర్ , భద్ర , మహారథి , గోరింటాకు, యమా గోల మళ్ళీ మొదలయింది మరియు మా ఆయన చంటి పిల్లడు వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది, పుట్టింది కేరళలోనే అయినా అచ్చ తెలుగు అమ్మాయి లాగానే ఉంటుంది మీరా జాస్మిన్, అందరి హీరోయిన్స్ లాగా ఎక్సపోసింగ్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాలలోనే నటించింది.

ఇది ఇలా ఉండగా ఈ జనరేషన్ లో మన దక్షిణ భారత దేశం నుండి జాతీయ అవార్డు అందుకున్న రెండవ నటిగా మీరా జాస్మిన్ కి అరుదైన రికార్డు ఉంది, 2003 వ సంవత్సరం లో మలయాళం లో ఆమె హీరోయిన్ గా నటించిన పాదం ఓను ఓరు విలపం అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమెకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది, కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే 2014 వ సంవత్సరం లో అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన ఈమె సినిమాలకు కొంత కాలం విరామం ఇచ్చింది, ఆ తర్వాత ఆమె 2016 వ సంవత్సరం నుండి మలయాళం లో మళ్ళీ సినిమాలు చెయ్యడం ప్రారంభించింది, ఈమె 2018 వ సంవత్సరం లో చేసిన పూమారం అనే మలయాళం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది, మంచి పాత్రలు దొరికితే తెలుగు లో కూడా మళ్ళీ నటిస్తాను అంటోంది ఈ భామ.

ఇది ఇలా ఉండగా చాల కలం తర్వాత మీరా జాస్మిన్ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి, ఇందులో ఆమె గుర్తు పట్టని విధంగా బొద్దుగా తయారు అయ్యింది , ఒక్కప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం క్రేజీ హీరోన్లు గా చలామణి అవుతున్న ఎంతోమంది హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేంత రేంజ్ లో అందంగా సన్నగా తయారు అయ్యింది, ఆమె లేటెస్ట్ ఫోటోలు కూని మీరు ఈ ఆర్టికల్ క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు , ఇక మీరా జాస్మిన్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె అనిల్ జాన్ టైటస్ అనే అతనిని 2014 వ సంవత్సరం లో పెళ్లి చేసుకుంది, ఈయన దుబాయి లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు, పెళ్లి తర్వాత కొంత కాలం విరామం ఇచ్చి మల్లి సినిమాల్లోకి అడుగు పెట్టిన మీరా జాస్మిన్, ఇక నుండి మంచి పాత్రలు వస్తే తెలుగు లో కూడా వరుసగా సినిమాలు చేస్తాను అంటూ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపింది, ఇక ఆమె లేటెస్ట్ ఫోటోలు మరియు భర్త తో కలిసి ఉన్న ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.