1 స్పూన్ చాలు-మీ కంటి చూపు ఎంతలా పెరుగుతుంధంటే మీరు కళ్ళజోడు మళ్ళీ పెట్టుకోరు,అలసట,నీరసం రాదు

వీటిని ఒక స్పూన్ రోజు పడుకునే ముందు పాలల్లో కలుపుకొని తీసుకుంటే చాలు మీ కంటికి సంబంధించిన ఎన్నో సమస్యలను నయం చేయడమే కాకుండా మీ కంటి చూపును రెట్టింపు చేస్తుంది. అలాగే కంట్లో శుక్లాలు కళ్ళు ఎర్రబడడం కంటి నుండి నీరు కారడం కంట్లో దురద ఎటువంటి సమస్యలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా ఈ రెమిడి అనేది మీ కంటికి సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా మీ మెదడును చల్లబరిచి మీ జ్ఞాపక శక్తిని కూడా రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఈ రెమిడి తయారు చేసుకోవడం కోసం మనకు ఏం కావాలి ,ఎలా తయారు చేసుకోవాలి? ఏ సమయంలో తీసుకోవాలి,

ఇటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అయితే మనకు రెమిడి కోసం ముఖ్యంగా కావలసినవి తెల్ల మిరియాలు దీనిని ఇంగ్లీషులో వైట్ పెప్పర్ అని అంటారు. ఈ తెల్ల మిరియాలు అనేది కంటికి సంబంధించిన సమస్యలను తొలగించడానికి ఒక రామబాణం లాంటి ఔషధం. ఇందులో ఉండే పోషకాలు విటమిన్స్ ఐరన్ ఇంకా ఇందులో ఉండే ఖనిజాలు అనేది మన కంటికి సంబంధించిన సమస్యలతో పాటు జ్ఞాపకశక్తిని రెట్టింపు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మీరు కనక మీ కంటి సైట్ ను తగ్గించుకొని మీ కంటి చూపును రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే ఈ రెమెడీ లో మీరు కచ్చితంగా తెల్ల మిరియాలను యాడ్ చేసుకోవాలి.

అయితే ఈ రెమెడీ లో ముందుగా తెల్ల మిరియాలు కావాలి అలాగే మనకు కావలసిన మరొక ఇంగ్రిడియంట్స్ పట్టిక బెల్లం దీన్నే కండ చక్కెర అని కూడా అంటారు, ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా మన కంటికి సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది అలాగే మన జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది, అలాగే ఈ కండ చక్కెరతో పాటు మనకు కావాల్సిన మరొక ఇంగ్రిడియంట్ సోంపు గింజలు వీటిలో విటమిన్స్, మినరల్స్ ,పోషకాలు, పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా మన కంటి చూపుని మెరుగుపరచడానికి జీర్ణశక్తిని రెట్టింపు చేయడానికి మన జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఈ సోంపు గింజలు బాగా హెల్ప్ చేస్తాయి.

ఈ సోంపు గింజలను యాంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన కంటిలో పెరిగే శుక్లాల సమస్యల నివారణకు కూడా ఈ సోంపు గింజలు ఒక అద్భుతమైన ఔషధం. అలాగే మరొక కావాల్సిన మరొక ఇంగ్రిడియంట్స్ బాదం, కంటి చూపును కానీ జ్ఞాపక శక్తిని రెట్టింపు చేయడానికి కానీ బాదం బాగా హెల్ప్ చేస్తుంది, కాబట్టి రెమిడి లో మనం తప్పకుండా బాదం ఉపయోగించాలి. మనకు ఇప్పుడు కావాల్సిన 4 ఇంగ్రిడియంట్స్ ఏమిటంటే తెల్ల మిరియాలు, పట్టిక బెల్లం (కండ చెక్కర), సోంపు,బాదం.

మనం ఈ రెమిడి కోసo పటిక బెల్లాన్ని 100 గ్రాముల వరకు తీసుకోవాలి, తర్వాత దీనిలో ఒక ఐదు గ్రాముల తెల్ల మిరియాలను ఆడ్ చేయాలి, తర్వాత 50 గ్రాముల సోంపు గింజలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడిటిని బాగా మిక్స్ చేయండి, ఇప్పుడు ఈ మూడిటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా పొడి లాగా మిక్సీ చేసుకోవాలి,ఇప్పుడు మనం ఈ పొడిలో 50 గ్రాముల బాదాన్ని కూడా కలుపుకోవాలి, ఇప్పుడు మరొకసారి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి, దీంతో బాదం అనేది పొడిలో బాగా గ్రైండ్ అయ్యి మెత్తని పొడి లాగా తయారవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన పొడి తయారైనట్లే దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో నెల రోజుల వరకు మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు.

ఇప్పుడు ఒక గ్లాస్ లో గోరువెచ్చని పాలను తీసుకోవాలి, ఈ పాలలో మనం ఇప్పుడు తయారు చేసుకుని పెట్టుకున్న ఈ పొడిని ఒక స్పూన్ మోతాదులో వేసి బాగా కలుపుకోవాలి. మనం ఈ పొడిని ఎవరికైనా వాడవచ్చు చిన్నపిల్లలకు అయితే ఆఫ్ స్పూన్ మోతాదులో కలిపి ఇస్తే సరిపోతుంది పెద్దవారికైతే ఒక స్పూన్ మొత్తం వేయాల్సి ఉంటుంది. ఈ పౌడర్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తాగుతారు, ఇందులో మనం కండ చక్కెరను కూడా కలిపాం కాబట్టి ఈ పాలు కూడా త్రాగడానికి తీయగా టేస్టీగా ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారు ఈ రెమిడిలో పట్టిక బెల్లాన్ని స్కిప్ చేసి ఈ రెమిడిని తయారు చేసుకోవచ్చు. మీరు ఈ పొడిని పాలలో కలుపుకొని తీసుకోవచ్చు లేదా ఈ పొడిని ఒక స్పూన్ మోతాదులో డైరెక్ట్ గా నోట్లో వేసుకుని నమిలి మింగేసి తర్వాత మీరు పాలను త్రాగేయొచ్చు ఈ విధంగా కూడా చేయవచ్చు. ఇలా ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ పాలను తీసుకోవాలి, కంటి చూపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.