హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పంటి నొప్పిని దూరం చేసుకోవడానికి అద్భుతమైన పురాతన కాలం నాటి ఒక చిట్కా గురించి తెలుసుకుందాం. దీని వల్ల కేవలం 5 నిమిషాల్లో పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏదో ఒక సందర్భంలో పంటి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ తీపి పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ లేదా పుల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ పళ్ళు జివ్వుమని లాగుతుంటాయి.
అలాగే చల్లటి నీళ్లు తాగినప్పుడు కూడా పళ్ళు జివ్వుమని లాగుతూఉంటాయి. దీనికి గల కారణం మనం తిన్న ఆహారం ఎంతోకొంత పళ్ళమధ్యలో ఇరుక్కోవడం వలన దంతక్షయం మొదలౌతుంది. ఆహారం తిన్న వెంటనే నోటిని సరిగా పుక్కలించకపోవడం రాత్రి పడుకునే ముందు కూడా నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం మొదలైన కారణాల వల్ల దంతాల మీద రంధ్రాలు ఏర్పడడం, దంతాలకు దంతాల చిగుళ్ళు వాపు రావడం ఇవన్నీ కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడతాయి. దీనివల్లనే పంటి నొప్పులు పిప్పిపన్ను తయారవుతాయి. పూర్తి రెమిడీ కోసం ఈ క్రింది వీడియోని చూడండి.
ఈ రెమిడి కోసం ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోండి. తరువాత బార్బర్ షాప్ లో ఉపయోగించే పటిక తీసుకొని దాన్ని మెత్తని పొడిలా చేసి ఒక చిటికెడు ఈ నీటిలో కలపండి. (ఈ పటిక మీకు ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది). తర్వాత ఈ నీటిని నోటిలో పట్టినన్ని వేసుకొని బాగా పుక్కిలించాలి. ఒక 30 నుంచి 40 సెకన్ల వరకూ బాగా పుక్కిలించి ఈ నీటిని ఉమ్మివేయాలి. ఈ విధంగా గ్లాసులో ఉన్న నీరు మొత్తం అయిపోయే వరకు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన నోటిలోని బ్యాక్టీరియా నాశనం అయ్యి దంత సంబంధిత సమస్యలు పంటినొప్పి తగ్గిపోతుంది. పట్టిక లో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్లను బ్యాక్టీరియాను నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఒక పావు స్కూలు స్పటిక పొడిని కొద్దిగా ఆవనూనెను కలిపిమెత్తని పేస్టులా చేసుకుని ఒక కాటన్ బాల్ సహాయంతో లేదా మీ చేతి వేలితో కొద్దిగా తెలుసుకొని పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే ఉంచుకుని తరువాత గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన చక్కటి ఫలితాలు చూస్తారు. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.