5రూ. ఖర్చుతో ఎంతటి వేలాడే పొట్ట, నడుము, తొడల చుట్టూ ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం అయితే స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కానీ ఏవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. .అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గవచ్చు.

బరువు తగ్గితే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. మార్కెట్లో బరువు తగ్గటానికి, శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల పలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. ఒక బౌల్ లో ఒక నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దానిలో వేడి నీటిని పోసి ఆ తర్వాత అరస్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టాలి.అరగంట అయ్యాక ఆ నీటిని వడకట్టి తాగాలి. డయబెటిస్ లేని వారు అరస్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు.

ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగవచ్చు. ఇలా 15 రోజుల పాటు తాగితే తేడా ఖచ్చితంగా కనపడుతుంది. నిమ్మకాయ,జీలకర్రలో ఉన్న పోషకాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి చాలా బాగా సహాయపడతాయి. జీలకర్ర,నిమ్మకాయ రెండూ మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.