హలో ఫ్రెండ్స్ ఏ అమ్మాయికి అయితే రుతుక్రమం అంటే పిరియడ్స్ టైంకి రాకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారో అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే రెమిడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణంగా 21 రోజుల నుండి 40 రోజుల మధ్య పీరియడ్స్ వస్తే మీకు ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. అలాగే మీ పీరియడ్స్ ఐదు రోజుల పాటు రాలేకపోతున్న తక్కువలో తక్కువ కనీసం ఐదు రోజులపాటు మీ డేట్ అనేది కచ్చితంగా రావాలి. ఒకవేళ ఎప్పుడైనా మీ పీరియడ్ లేట్ అయినా లేదా రెండు మూడు నెలలకు ఒకసారి డేట్ వస్తున్నా లేదా సరైన విధంగా రాకున్నా కొందరికి రెండు లేదా మూడు రోజుల పాటు వస్తుంది అలాంటి వారందరికీ ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
బహిష్టు క్రమపద్ధతిలో రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈమధ్య అమ్మాయిలు డైటింగ్ అంటూ ఆహారం సరిగా తీసుకోకపోవడం వలన హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వలన పౌష్టికాహార లోపం వలన, పిసిఓడి, థైరాయిడ్ మొదలైన కారణాల వలన ఆడవారిలో నెలసరి అనేది సరిగా రావడం లేదు. పెళ్ళికాని అమ్మాయిలు గనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీకు పెళ్లయిన తర్వాత పిల్లలు కావాలి అని కోరుకునే టైం కి చాలావరకు నిరాశే ఎదురవుతుంది.
కావున మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువగా మంచి ఆహారం తీసుకోవాలి. పండ్లు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తినాలి దీనివల్ల హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ క్రమబద్దం అవుతుంది. అలాగే రోజు ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని త్రాగాలి. జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ మసాలాలు ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. రోజులో ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి దీనివల్ల మీ నెలసరి క్రమ పద్ధతిలో రావడానికి అవకాశం ఉంటుంది. రెమిడి తయారీ తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడండి.
రెడీ ని ఎలా తయారు చేసుకోవాలి
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం కలపండి. ఇందులో ఇప్పుడు ఒక టమోటా రసం కలపండి. ఈ డ్రింక్ ను రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఈ డ్రింక్ తో పాటు కొద్దిగా బెల్లాన్ని కూడా తింటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి.