99% మందికి తెలియదు యాలకుల ఆరోగ్య రహస్యం

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఉదాహరణకు కొంత మంది డయాబెటిస్, కొంత మంది హై బి.పి ఉందని, మరికొంత మంది అధిక బరువు సమస్యతో, మరికొంతమంది సమస్యతో ,అలాగే కొంతమంది పింపుల్స్ సమస్యతో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

ఎందుకంటే మానవ శరీరం అలా రూపొందించబడింది, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. ఇది జీవిత సత్యం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారు అంటే షుగర్ అంటే డయాబెటిస్ వస్తే తొందరగా చనిపోతారు అనుకుంటూ ఉంటారు కానీ ఇది అసలు నిజం కాదు.

షుగర్ ఉన్న వారు ఎక్కువ కాలం చక్కగా జీవించవచ్చు నూరేళ్ళు జీవించిన వారు కూడా ఉన్నారు. మిగతా వారి లాగే షుగర్ సమస్య ఉన్నవారు కూడా హెల్దీగా యాక్టివ్ గా ఉండవచ్చు. షుగర్ సమస్య అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, మన జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే అనారోగ్యం. షుగర్ ఒక్కటే కాదు మన జీవన శైలిలో మార్పుల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే మన జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ ని మార్చుకుంటే ఎలాంటి సమస్యలు వచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేవు. ముఖ్యంగా మనం తినే త్రాగే ఆహార అలవాట్లలో కొన్ని మంచి అలవాట్లను చేసుకోవాలి. ఇంట్లో ఉండే మన వంటగదిలోనే ఎన్నో ఆయుర్వేద ఔషధ దినుసులను మనం ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే వాటిని సరైన పద్ధతిలో సక్రమంగా ఉపయోగిస్తే ఎన్నో సమస్యలను నివారించవచ్చు. అలాగే మనం ఎక్కువకాలం ఆరోగ్యంగా హెల్దీగా ఉండవచ్చు. అయితే ఇలాంటి ఔషధ దినుసులలో ఒక ముఖ్యమైన పదార్థం గురించి తెలుసుకుందాం. అవి మరేమిటో కాదు యాలకులు, ఆయుర్వేదంలో యాలకులను ఒక దివ్య ఔషధంగా భావిస్తారు. ఎక్కువ మంది వీటిని ప్రతి రోజూ కూరలలో, అలాగే స్వీట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా మన ధర్మం లో కూడా పాలకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఉదాహరణకు పూజా కార్యక్రమంలో గుడిలో ప్రసాదం రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. మీరు ఏదైనా గుడికి వెళితే అక్కడ ఇచ్చే తీర్థంలో, ప్రసాదంలో యాలకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే మన పూర్వీకులు దీన్ని గొప్ప ఔషధ గుణాలను తెలుసుకునే ప్రసాదం రూపంలో ప్రజలకి వీటిని పంచిపెట్టేవారు. దీని వల్ల ఎంతో మందికి వారికి తెలియకుండానే గుడిలో ప్రసాదం తిని ఎన్నో సమస్యల నుండి బయట పడే వారు. యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. అవి ఏమిటో తెలుసుకుంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు, అలాగే యాలకులను ఎలా తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. యాలకుల లో పొటాషియం, మెగ్నీషియం ,క్యాల్షియం ,మినరల్స్ అలాగే విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ సి, మరియు ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే యాలకులు మన శరీరానికి ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ లా పనిచేస్తాయి. ముఖ్యంగా యాలకులు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటంటే ఎవరి నోటి నుండి అయితే దుర్వాసన ఎక్కువగా వస్తుందో, బ్రష్ చేసుకున్నప్పటికీ విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే అలాంటి వారు బ్రష్ చేసుకున్న వెంటనే రెండు యాలకులను మరియు రెండు పుదీనా ఆకులను బాగా నమిలి తినండి. ఇలా చేస్తే రోజంతా దుర్వాసన లేకుండా నోరు అంతా ఫ్రెష్ గా ఉంటుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి ..